మెగాస్టార్ జోడీగా ఆ సినిమాను నేను చేయవలసింది: నటి ఆమని
- అభినయ ప్రధానమైన పాత్రలను చేసిన ఆమని
- 'రిక్షావోడు' ఛాన్స్ చేజారిందని వివరణ
- ఆ సమయంలో సౌందర్య అభినందించిందని వెల్లడి
- వెంకటేశ్ తోనూ చేయలేకపోయానని అసంతృప్తి
"మొదటి నుంచి కూడా నేను చిరంజీవి గారి అభిమానిని. ఆయన సరసన నటిస్తే చాలునని అనుకున్నాను. 'రిక్షావోడు' సినిమాలో ఆయన సరసన నన్ను .. సౌందర్యను ఎంచుకున్నారు. ఆ తరువాత ఆ సినిమాకి డైరెక్టర్ మారారు. అప్పుడు నా ప్లేస్ లో నగ్మా ఎంట్రీ ఇచ్చారు. అలా ఆయన జోడీగా నటించే అవకాశాన్ని కోల్పోయాను" అన్నారు.
'చిరంజీవిగారితో కలిసి నటించే అవకాశం వచ్చినప్పుడు నా స్నేహితురాలిగా సౌందర్య సంతోషపడింది. కానీ ఆ తరువాత ఆ అవకాశం చేజారినప్పుడు చాలా బాధపడ్డాను. మెగాస్టార్ తో చేయాలనే ఆ కోరిక అలాగే ఉండిపోయింది. వెంకటేశ్ జోడీగా కూడా చేయలేకపోయాను' అంటూ చెప్పుకొచ్చారు.