‘ఉస్తాద్’ గా వస్తున్న కీరవాణి కొడుకు శ్రీ సింహా
- మత్తు వదలరా చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీసింహా
- ఫణిదీప్ దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రకటన
- పైలట్ పాత్రలో కనిపించనున్న యువ హీరో
దీనికి ఉస్తాద్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు శ్రీ సింహా పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఫణిదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి, క్రిషీ ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో శ్రీ సింహా నిర్భయమైన పైలట్ పాత్రలో నటిస్తున్నాడు. ‘తన కలలకు రెక్కలు తొడిగి చిన్న పట్టణం నుంచి ఆకాశం వరకు ఎదిగిన నిర్భయమైన పైలట్ ను కలవండి’ అంటూ పోస్టర్ కు క్యాప్షన్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమాకు పవన్ కుమార్ పప్పుల సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, అకీవ సంగీతం అందించనున్నారు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.