వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
- గత నెలలో అవినాశ్ ను తొలిసారి విచారించిన సీబీఐ
- ఈ నెల 24న హాజరు కావాలంటూ తాజాగా నోటీసులు
- నోటీసులను వాట్సాప్ ద్వారా పంపిన సీబీఐ అధికారులు
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి తొలిసారిగా గత నెల 28న సీబీఐ ఎదుట హాజరయ్యారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు. అవినాశ్ కాల్ డేటా ఆధారంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది.