మెగా ఫ్యామిలీ కాళ్లు పట్టుకోవాలి .. కన్నీళ్లు పెట్టుకున్న పాకీజా!
- కష్టాల్లో ఉన్న పాకీజాకి నాగబాబు సాయం
- మోహన్ బాబు గారు స్పందించారన్న పాకీజా
- అవకాశాలు వస్తున్నాయంటూ హర్షం
- సాయం చేస్తున్నవారికి కృతజ్ఞతలు చెప్పిన పాకీజా
తాజాగా ఆమె కృతజ్ఞతలు చెప్పుకోవడానికి సుమన్ టీవీకి మరోసారి వచ్చారు. ఆమె మాట్లాడుతూ .. " సుమన్ టీవీ వారు నా ఎకౌంట్ నెంబర్ ఇచ్చినందువలన 100 రూపాయల నుంచి 10వేల వరకూ చాలామంది తమ సాయాన్ని అందజేస్తూ వస్తున్నారు. వాళ్లందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అన్నారు.
"నాగబాబు గారు చేసిన సాయం చాలా పెద్దది. మెగా ఫ్యామిలీ కాళ్లను పట్టుకోవాలని ఉంది. ఆ మధ్య మోహన్ బాబుగారికి కూడా మెసేజ్ పెట్టాను. ఆ సమయంలో ఆయన 'లండన్' లో ఉన్నట్టుగా చెప్పారు. అక్కడి నుంచి వచ్చిన తరువాత మాట్లాడదామని అన్నారు. ఇక నా పరిస్థితి తెలిసి సీరియల్స్ లోను .. సినిమాల్లోను ఛాన్సులు ఇస్తున్నారు" అంటూ కన్నీళ్లు తుడుచుకున్నారు.