బీజేపీ భయంతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటవుతున్నాయి: బండి సంజయ్
- ఈసారి తెలంగాణలో హంగ్ వస్తుందన్న కోమటిరెడ్డి
- కేసీఆర్ కాంగ్రెస్ తో కలుస్తారని వ్యాఖ్యలు
- బీఆర్ఎస్ తో కలిసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న సంజయ్
- కాంగ్రెస్ ఉనికి ఎక్కడా లేదని వెల్లడి
బీఆర్ఎస్ తో కలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టుందని అన్నారు. కాంగ్రెస్ ఉనికి ఎక్కడా లేదని తెలిపారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని బండి సంజయ్ స్పష్టం చేశారు. అందుకే బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేశారని వివరించారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిసి బీఆర్ఎస్ పోటీ చేస్తుందని అన్నారు. బీజేపీ భయంతోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటవుతున్నాయని విమర్శించారు. అధికారంలోకి రాలేమని కాంగ్రెస్సే చెబుతోందని బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న యాత్రలతో ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల వరకు తన్నుకుని, అప్పుడు కలిసి పోటీ చేస్తారని ఎద్దేవా చేశారు.