సుకుమార్ తో సిద్ధూ జొన్నలగడ్డ కొత్త చిత్రం
- దర్శకురాలిగా పరిచయం కాబోతున్న వైష్ణవి
- డీజే టిల్లుతో క్రేజీ హీరోగా మారిన సిద్ధూ
- ప్రస్తుతం ఆ చిత్రం సీక్వెల్ లో నటిస్తున్న యువ హీరో
ప్రేమ కథతో రూపొందే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు తెలియాల్సి ఉంది. సిద్ధూ ప్రస్తుతం ప్రస్తుతం డీజే టిల్లుకు సీక్వెల్ గా రూపొందుతోన్న ‘టిల్లు స్క్వేర్’లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సిద్దూ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.