నన్ను చూసి రజనీ భయపడేవారు: అలనాటి నాయిక లత
- 1970లలో గ్లామరస్ హీరోయిన్ గా లత
- ఎంజీఆర్ జోడీగా తొలి సినిమా ఛాన్స్
- అక్కినేని 'అందాలరాముడు'తో తెలుగు తెరకి పరిచయం
- తాజాగా ఇంటర్వ్యూలో అలనాటి ముచ్చట్లు
"ఆయన జోడీగా ఐదేళ్ల పాటు నటించడానికి కాంట్రాక్ట్ చేసుకోవడం జరిగింది. అందువల్లనే నన్ను అందరూ కూడానా ఎంజీఆర్ లత అంటూ ఉంటారు. నా ఫస్టు హీరో ఆయన .. ఆయన లాస్ట్ హీరోయిన్ నేను. ఆ తరువాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఆ తరువాత నేను రజనీకాంత్ తోను చేశాను .. మా ఇద్దరి గురించి గాసిప్స్ వచ్చాయిగానీ నేను పట్టించుకోలేదు" అన్నారు.
నేను ఎంజీఆర్ హీరోయిన్ గా రావడం వలన నా ఎదురుగా కూర్చోవడానికీ .. మాట్లాడటానికి రజనీ భయపడేవాడు. ఆ తరువాత ఆయన ఆ విషయం చెబితే నేను నవ్వేశాను. ఏఎన్నార్ తో 'అందాలరాముడు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమయ్యాను. గోదావరి ఒడ్డున ఆ సినిమా షూటింగు ఎంతో సరదాగా జరిగింది" అంటూ చెప్పుకొచ్చారు.