అవినాశ్ రెడ్డి లాయర్ ను అనుమతించని సీబీఐ అధికారులు.. కొనసాగుతున్న విచారణ
- కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అవినాశ్ విచారణ
- అవినాశ్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్న సీబీఐ అధికారులు
- అవసరమైతే అవినాశ్ ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం
మరోవైపు, తనతో పాటు తన లాయర్ ను కూడా విచారణ సమయంలో అనుమతించాలన్న అవినాశ్ విన్నపాన్ని సీబీఐ అధికారులు తిరస్కరించారు. అవినాశ్ లాయర్ ను కార్యాలయం బయటే ఆపేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ కార్యాలయానికి వచ్చిన అవినాశ్ నేరుగా లోపలకు వెళ్లిపోయారు. మరోవైపు అంతకు ముందే అక్కడకు చేరుకున్న వైసీపీ శ్రేణులను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు.