సీబీఐ విచారణకు ముందు లోటస్ పాండ్ లో వైఎస్ విజయమ్మను కలిసిన వైఎస్ అవినాశ్ రెడ్డి
- మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ ముందు హాజరుకానున్న అవినాశ్ రెడ్డి
- విజయమ్మను కలిసి వెళ్లిపోయిన అవినాశ్
- సీబీఐ విచారణకు హాజరవుతున్నానని మీడియాతో చెప్పిన కడప ఎంపీ
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ... సీబీఐ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఈ మధ్యాహ్నం కోఠిలోని కార్యాలయంలో విచారణకు హాజరవుతానని చెప్పారు. అనంతరం లోటస్ పాండ్ నుంచి వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణను ఏపీ నుంచి హైదరాబాద్ కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.