'కొరమీను' ఏ ఒక్కరినీ నిరాశపరచదు: హీరో ఆనంద్ రవి
- విభిన్నమైన కథా చిత్రంగా రూపొందిన 'కోరమీను'
- వైజాగ్ నేపథ్యంలో నడిచే కథ
- కథానాయకుడిగా ఆనంద్ రవి పరిచయం
- ఈ నెల 31వ తేదీన విడుదలవుతున్న సినిమా
ఓ డ్రైవర్ .. అహంకారంతో కూడిన అతని యజమాని .. వైజాగ్ కి చెందిన ఓ పవర్ఫుల్ పోలీస్ .. ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య నడిచే చిత్రమే ‘కొరమీను’. డిసెంబర్ 31న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా బుధవారం కొరమీను టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
డైరెక్టర్ శ్రీపతి మాట్లాడుతూ.. "ఒక డైరెక్టర్‌లా కాకుండా.. ఓ ప్రేక్షకుడిలా చెబుతున్నా. ఈ సినిమా రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చే సమయంలో కచ్చితంగా ప్రేక్షకులే సినిమాను ప్రమోట్ చేస్తారు' అని అన్నారు. హీరో ఆనంద్ రవి మాట్లాడుతూ.. "ఈ సినిమాను చూసిన ఏ ఒక్కరూ నిరాశ చెందరు. ఇంతకు మించి నేనేమీ ఇప్పుడు చెప్పను. ఆ తరువాత మాట్లాడుకుందాం' అని అన్నారు.
.