కొనసాగుతున్న షర్మిల నిరాహారదీక్ష.. ఆరోగ్యం క్షీణిస్తోందన్న వైఎస్సార్టీపీ!
- మంచి నీళ్లు కూడా తీసుకోని షర్మిల
- డీహైడ్రేట్ అవుతున్న శరీరం
- షర్మిలకు సంఘీభావంగా దీక్షాస్థలిలో కూర్చున్న విజయమ్మ
షర్మిల నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. షర్మిల కనీసం మంచి నీళ్లు కూడా తీసుకోవడం లేదని వైఎస్సార్టీపీ తెలిపింది. దీంతో శరీరం డీహైడ్రేట్ అవుతోందని, ఆరోగ్యం క్షీణిస్తోందని పేర్కొంది. మరోవైపు ఆమెకు అపోలో ఆసుపత్రి వైద్యులు చంద్రశేఖర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. దీక్ష ఇలాగే కొనసాగితే ఆమె కిడ్నీలకు ప్రమాదం పొంచి ఉందని వైద్యులు చెపుతున్నారు. మరోవైపు తన కూతురు దీక్షకు సంఘీభావంగా వైఎస్ విజయమ్మ దీక్షాస్థలిలో కూర్చున్నారు.
ఇదిలావుంచితే, షర్మిల దీక్ష నేపథ్యంలో లోటస్ పాండ్ ను పోలీసులు దిగ్బంధించారు. పార్టీ కార్యకర్తలను లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇంకోవైపు బొల్లారం పోలీస్ స్టేషన్లో 40 మంది పార్టీ నేతలు, బంజారాహిల్స్ పీఎస్ లో ఏడుగురు నేతలు పోలీసుల అదుపులో ఉన్నారు.