బాలకృష్ణ 108వ సినిమాకి రేపే ముహూర్తం!
- ముగింపు దశలో 'వీరసింహా రెడ్డి'
- రేపు పట్టాలపైకి వెళతున్న 108వ సినిమా
- ఉదయం 9:36 నిమిషాలకు లాంచ్
- దర్శకుడిగా అనిల్ రావిపూడి
సాహు గారపాటి .. హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకి, అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నాడు. కొంతకాలంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కసరత్తు జరుగుతూ వస్తోంది. మొత్తానికి ఈ సినిమా షూటింగు లాంచ్ కి ముహూర్తాన్ని ఖాయం చేసినట్టుగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.
హైదరాబాదులో రేపు ఉదయం 9:36 నిమిషాలకు ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల చేయనుండగా, ఆయన సరసన నాయికగా ప్రియాంక జవాల్కర్ పేరు వినిపిస్తోంది. రేపు మిగతా వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది.