రాజకీయాల్లోకి బాలీవుడ్ నటి కంగన.. ప్రజాసేవ చేయాలని ఉందంటూ హింట్!
- హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలని ఉందంటూ మనసులోని మాట బయటపెట్టిన కంగన
- బీజేపీ అవకాశం ఇస్తే మండీ ప్రాంతం నుంచి పోటీ చేస్తానని వెల్లడి
- మోదీకి రాహుల్ పోటీ కానేకాదన్న బాలీవుడ్ నటి
నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత ప్రతీ ఒక్కరిలోనూ జాతీయభావం కనిపిస్తోందన్నారు. తాను కాంగ్రెస్ విధానాలను అనుసరించే కుటుంబం నుంచి వచ్చినప్పటికీ మోదీ పనితీరుతో ఇప్పుడు తమ కుటుంబం బీజేపీవైపు నిలిచిందన్నారు. తాను కనుక సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనాలని హిమాచల్ ప్రదేశ్, మరీ ముఖ్యంగా మండీ ప్రాంత ప్రజలు, బీజేపీ కనుక కోరుకుంటే మండీ ప్రాంతం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెబుతూ కంగన తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కాంగ్రెస్ రాహుల్ గాంధీ పోటీదారు కానేకాదని తేల్చి చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో ‘ఆప్’ అధినేత కేజ్రీవాల్ ప్రకటించే ఉచితాలు పనిచేయవని కంగన పేర్కొన్నారు.