మాతో పని లేదు.. మునుగోడులో కాంగ్రెస్ ను ఆయనే గెలిపిస్తాడు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- మునుగోడు ప్రచారానికి వెళ్లబోనన్న వెంకటరెడ్డి
- తాను హోంగార్డునని.. ఎస్పీ స్థాయి వ్యక్తులే వెళ్తారని ఎద్దేవా
- తన గురించి మాట్లాడేంత స్థాయి కడియం శ్రీహరికి లేదని వ్యాఖ్య
ఇదే సమయంలో టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరిపై కూడా ఆయన మండిపడ్డారు. తన గురించి మాట్లాడేంత స్థాయి శ్రీహరికి లేదని అన్నారు. తాను విదేశాలకు ఎప్పుడు వెళ్లాలనే విషయం గురించి మంత్రి కేటీఆర్ ను అడగాలని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఓటు వేసేందుకు గాంధీభవన్ కు వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు ఎవరికి వేశారనే మీడియా ప్రశ్నకు బదులుగా... ప్రజాస్వామ్యంలో ఓటు ఎవరికి వేశామనేది చెపుతామా? అని ప్రశ్నించారు. అది చెప్పడం చాలా పెద్ద తప్పు అని అన్నారు.