కొనసాగుతున్న కలెక్షన్ల వర్షం.. రూ. 400 కోట్లకు చేరువైన ‘బ్రహ్మాస్త్ర’
- ప్రపంచ వ్యాప్తంగా చిత్రానికి ఆదరణ
- విడుదలై మూడు వారాలైనా రద్దీగా థియేటర్లు
- తెలుగులో అంతగా ఆకట్టుకోలేని చిత్రం
తెలుగు సహా ప్రాంతీయ భాషల్లో అంతగా ఆకట్టుకోలేకపోయినా హిందీలో మాత్రం మంచి సక్సెస్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ‘బ్రహ్మాస్త్ర’ దియేటర్లు రద్దీగా కనిపిస్తున్నాయి. మూడు వారాల తర్వాత కూడా థియేటర్లు 85 శాతం నిండుతున్నాయి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ కీలక పాత్రల్లో నటించారు. షారూక్ ఖాన్ అతిథి పాత్రలో మెరిశారు. కాగా, రూ. 410 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం మూడు భాగాలుగా వస్తుందని చిత్రం బృందం తెలిపింది. రెండో పార్టును 2025లో విడుదల చేయాలని చూస్తున్నారు.