'ఒకే ఒక జీవితం' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. వేదిక ఎక్కడంటే!
- శర్వానంద్ తాజా చిత్రంగా 'ఒకే ఒక జీవితం'
- టైమ్ ట్రావెల్ నేపథ్యంలో నడిచే కథ
- కీలకమైన పాత్రలో అమల అక్కినేని
- ఈనెల 9వ తేదీన విడుదలవుతున్న సినిమా
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. రేపు హైదరాబాదు .. జేఆర్సీ కన్వెన్షన్స్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక జరగనుంది. ముఖ్య అతిథులుగా ఎవరు వస్తారనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. భారీ స్థాయిలోనే ఈవెంట్ ను ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు.
ఇది కేవలం మదర్ సెంటిమెంట్ కి సంబంధించిన సినిమా అని మొన్నటివరకూ అనుకున్నారు. ఆ సెంటిమెంట్ అనేది టైమ్ ట్రావెల్ తో ముడిపడి ఉంటుందంటూ సినిమాపై అంచనాలు పెంచారు. వరుస ఫ్లాపులతో ఉక్కిరి బిక్కిరవుతున్న శర్వానంద్ కి ఈ సినిమాతో హిట్ పడుతుందేమో చూడాలి.