దేవి శ్రీ ప్రసాద్ తో సీక్రెట్ గా పెళ్లి జరిగిందంటూ వస్తున్న వార్తలపై పూజిత పొన్నాడ స్పందన
- ఊపిరి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన పూజిత
- ప్రస్తుతం ఆకాశ వీధుల్లో చిత్రంలో నటించిన వైజాగ్ బ్యూటీ
- దేవి శ్రీతో పెళ్లంటూ కథనాలు
- తనకు ఎవరితోనూ రిలేషన్ లేదంటూ పూజిత స్పష్టీకరణ
గతంలో రంగస్థలం, హ్యాపీ వెడ్డింగ్, ఓదెల రైల్వే స్టేషన్ వంటి చిత్రాల్లో నటించిన పూజిత ప్రస్తుతం 'ఆకాశ వీధుల్లో' అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ప్రస్తుతం తాను ఒంటరినే అని, సోషల్ మీడియాలో నెగెటివ్ వ్యాఖ్యలు బాధ కలిగిస్తాయని వెల్లడించింది. వైజాగ్ కు చెందిన పూజిత పొన్నాడ 'ఊపిరి' చిత్రంతో టాలీవుడ్ వెండితెరకు పరిచయం అయింది.