మునుగోడు ఉప ఎన్నికలో వైఎస్సార్టీపీ పోటీ.. నలుగురి పేర్లు పరిశీలిస్తున్న షర్మిల
- ప్రచారంలో దూసుకుపోవాలని షర్మిల నిర్ణయం
- వైఎస్సార్ పాలన ఓట్లు తెచ్చిపెడుతుందని నమ్మకం
- ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్సార్ పాలనను గుర్తు చేసే దిశగా ప్రణాళిక
తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సంక్షేమ పాలన తన పార్టీకి తెలంగాణలో ఓట్లను తెచ్చిపెడుతుందన్న బలమైన నమ్మకంతో షర్మిల సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ఇతర పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా ప్రచారం చేయాలని ఆమె నిర్ణయించారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటిని సందర్శించనున్న ఆ పార్టీ నేతలు... వైఎస్సార్ పాలనను గుర్తు చేసే దిశగా ప్రణాళిక రూపొందించారు.