అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్‌ల భేటీపై ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందన ఇదే!
- హైదరాబాద్‌లో జరిగిన అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ
- భేటీ రాజకీయమే అయ్యుండొచ్చన్న ఉండవల్లి
- తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను బీజేపీ వినియోగించుకోవచ్చని అంచనా
- జూనియర్ ఎన్టీఆర్‌కు అన్ని అంశాలపై అవగాహన ఉందన్న మాజీ ఎంపీ
జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా సమావేశం రాజకీయమే అయ్యుండొచ్చని ఉండవల్లి పేర్కొన్నారు. ఒక్క తెలంగాణలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకునే దిశగా ఈ భేటీలో చర్చలు జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని అంశాలపై జూనియర్ ఎన్టీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉందని కూడా ఈ సందర్భంగా ఉండవల్లి పేర్కొన్నారు.