లైగర్ కు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చి ఏడు కట్స్ చెప్పిన సెన్సార్ బోర్డు
- విజయ్ దేవరకొండ హీరోగా లైగర్
- అనన్యా పాండే కథానాయిక
- పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టయినర్
- సినిమా రన్ టైమ్ 140.20 నిమిషాలు
'ఎఫ్' తో మొదలయ్యే ఓ పదాన్ని అనేకచోట్ల ఉపయోగించారని, ఆ పదం వచ్చిన చోట మ్యూట్ చేయాలని సెన్సార్ బోర్డు సూచించింది. లైగర్ లో నటీనటులు కొన్నిచోట్ల ఎదుటివారిపై ఆవేశం వచ్చినప్పుడు ఉపయోగించిన సైగలు అభ్యంతరకంగా ఉన్నాయని, వాటిని బ్లర్ చేయాలని సూచించింది. అంతేకాదు, చేతులతో చేసే మరో సంజ్ఞ కూడా అసభ్యకరంగా ఉందని, దాన్ని తొలగించాలని స్పష్టం చేసింది.
.