కియారా అద్వానీపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్.. అసలు ఏం జరిగిందంటే..!
- ముంబైలో షూటింగ్ కు వెళ్తూ మీడియా కంట పడిన కియారా
- వర్షం పడుతుండటంతో గొడుగు పట్టుకున్న బాడీ గార్డ్
- ఏం నీకు చేతుల్లేవా? అంటూ కియారాపై ఫైర్ అవుతున్న నెటిజన్లు
అసలు ఏం జరిగిందంటే... తాజాగా ఓ సినిమా షూటింగ్ కు వెళ్తూ ముంబైలో ఆమె మీడియా కంటపడింది. కారులో నుంచి కిందకు దిగి షూటింగ్ స్పాట్ కు ఆమె వెళ్తోంది. అదే సమయంలో వర్షం పడుతుండటంతో... ఆమె తడవకుండా బాడీ గార్డ్ గొడుగు పట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆమెపై నెటిజన్ల కోపానికి కారణమయింది. గొడుగు పట్టుకునేందుకు నీకు చేతులు లేవా? అని కొందరు మండిపడగా... ఆమెకు చేతుల్లేవేమో, అందుకే గొడుగు పట్టుకోలేకపోయిందంటూ మరికొందరు విమర్శించారు. గొడుగు నీకు మాత్రమే అవసరమా... సెక్యూరిటీ గార్డుకు అవసరం లేదా? అని ఇంకొందరు ట్రోల్ చేస్తున్నారు.