ఆలోచనలో పడిన వరుణ్ తేజ్!
- 'గని'తో ఫ్లాప్ అందుకున్న వరుణ్
- ఆశించిన విజయాన్ని పొందని 'ఎఫ్ 3'
- వరుసగా కథలు వింటున్న వరుణ్
- త్వరలోనే ప్రాజెక్టును సెట్ చేసుకునే ఛాన్స్
ఆ తరువాత వరుణ్ తేజ్ నుంచి వచ్చిన 'ఎఫ్ 3' కూడా ఆశించినస్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. నవ్వుల సందడి చేస్తుందనుకున్న ఈ సినిమా హడావిడి మాత్రమే చేసింది. దాంతో తన తదుపరి సినిమా విషయంలో వరుణ్ తేజ్ ఆలోచనలో పడినట్టుగా చెబుతున్నారు. ప్రవీణ్ సత్తారుతో చేయాలనుకున్న ప్రాజెక్టును ఆయన హోల్డ్ లో పెట్టాడని అంటున్నారు.
ప్రవీణ్ సత్తారు నుంచి త్వరలో 'ది ఘోస్ట్' రానుంది. ఆ సినిమా ఫలితాన్ని చూసిన తరువాత నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాడట. ప్రస్తుతం ఆయన కథలను వినడంలో బిజీగా ఉన్నాడని చెబుతున్నారు. మరి వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాను ఏ దర్శకుడితో సెట్ చేసుకుంటాడనేది చూడాలి.