ఎవరినైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి: ఆమిర్ ఖాన్
- దేశంలో అసహనం పెరిగిపోయిందంటూ గతంలో వ్యాఖ్యానించిన ఆమిర్
- ఆయన తాజా చిత్రం 'లాల్ సింగ్ చడ్డా'ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు
- తాను ఎవరినీ నొప్పించాలని అనుకోలేదన్న ఆమిర్
తాను ఎవరినైనా బాధపెట్టి ఉంటే దయచేసి క్షమించాలని ఆమిర్ కోరారు. తాను ఎవరినీ నొప్పించాలని అనుకోలేదని చెప్పారు. తన సినిమాను ఎవరైనా చూడొద్దని అనుకుంటే... వారి సెంటిమెంట్ ను కూడా తాను గౌరవిస్తానని అన్నారు. మరోవైపు ఈ చిత్రం ఆగస్ట్ 11న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో కరీనా కపూర్, మోనా సింగ్, అక్కినేని నాగచైతన్య తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ కు చెందిన ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. అద్వైత్ చందన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.