కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వెళ్లిపోవచ్చు: రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- కోమటిరెడ్డి సోదరులకు కాంగ్రెస్ ఎన్నో అవకాశాలను కల్పించిందన్న దామోదర్
- రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం దారుణమని వ్యాఖ్య
- కేఏ పాల్, రాజగోపాల్ ఇద్దరూ ఒక్కటేనని ఎద్దేవా
ఏపీలో కేఏ పాల్, తెలంగాణలో రాజగోపాల్ ఇద్దరూ ఒకటేనని... ఏం మాట్లాడతారో వారికే తెలియదని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరూ ఒకే రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారని... వెంకటరెడ్డి తీరును చూస్తుంటే ఆయన కూడా బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోందని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చండూరు సభకు హాజరు కాకుండా... అమిత్ షాను కలిసేందుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.