అక్షయ్ కుమార్ తో మళ్లీ జోడీ కట్టిన పరిణీతి
- లండన్ లో జరుగుతున్న షూటింగ్ లో జాయిన్ అయిన యువ నటి
- గతంలో ఇద్దరూ కలిసి చేసిన ‘కేసరి’ సూపర్ హిట్
- మరో హిట్ గ్యారంటీ అంటున్న తాజా చిత్ర బృందం
ప్రస్తుతం బాలీవుడ్ ను ఏలుతున్న స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో రెండోసారి జోడీ కట్టింది. తను హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు పరిణీతి హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్రానికి టినూ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. పూజా ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ మధ్యే అధికారికంగా ప్రకటించారు. ఇంకా పేరు పెట్టలేదు. ఓ కోల్‌మైన్ ఆపరేషన్‌లో ఎంతోమందిని కాపాడిన జస్వంత్ గిల్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.
జస్వంత్ పాత్రలో అక్షయ్ నటిస్తున్నాడు. అతనికి జోడీగా పరిణీతి కనిపించబోతోంది. లండన్ లో జరుగుతున్న షూటింగ్ లో పరిణీతి కూడా జాయిన్ అయ్యింది. అక్షయ్, పరిణీతి గతంలో ‘కేసరి’ చిత్రంలో నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ హిట్ పెయిర్ మరో విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.