పోలవరం పూర్తి కావాలంటే రూ. 30 వేల కోట్లు కావాలి: తులసిరెడ్డి
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే 2016 నాటికే పోలవరం పూర్తయ్యేదన్న తులసిరెడ్డి
- టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల నిర్వాకం వల్ల పోలవరం పూర్తి కాలేదని విమర్శ
- పోలవరం పూర్తి కావాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలన్న తులసిరెడ్డి
ఏపీలోని ప్రాంతీయ పార్టీలకు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే శక్తి లేదని... సొంతంగా ప్రాజెక్టును నిర్మించే శక్తి కూడా లేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పోలవరం పూర్తవుతుందని అన్నారు.