వరద బాధితులకు ఆమిర్ ఖాన్ భారీ సాయం
- భారీ వరదలతో సతమతమవుతున్న అసోం
- రూ. 25 లక్షల విరాళం ఇచ్చిన ఆమిర్ ఖాన్
- వరద బాధితులకు అండగా నిలిచారని సీఎం హేమంత ప్రశంస
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా తన వంతు సాయం అందించి పెద్ద మనసును చాటుకున్నారు. అసోం సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25 లక్షలను అందించారు. ఆమిర్ చేసిన సాయాన్ని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ప్రశంసించారు. వరద బాధితుల సహాయార్థం రూ. 25 లక్షల విరాళాన్ని అందించి వారికి అండగా నిలిచారని కొనియాడారు. ఆమిర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తున్నానని చెప్పారు. మరోవైపు ఆమిర్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, కరీనా కపూర్ ముఖ్య పాత్రలను పోషించారు.