టి-హబ్ పై కేటీఆర్ ట్వీట్... స్పందించిన విజయ్ దేవరకొండ
- టి-హబ్ కు నూతన భవన సముదాయం
- ఈ నెల 28న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
- ఆవిష్కరణల రంగానికి ఊతమిస్తుందన్న కేటీఆర్
- గొప్ప చర్య అంటూ విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు
కాగా, కేటీఆర్ ట్వీట్ పై యువ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. మెరుగైన భవిష్యత్ కోసం ఇది గొప్ప చర్య అని కొనియాడారు. యువ పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, ఎన్నో ఉద్యోగాలు కల్పించేందుకు వీలుపడుతుందని విజయ్ అభిప్రాయపడ్డారు. నానాటికీ తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి హర్షణీయమని పేర్కొన్నారు.