వీధికో ఎమ్మెల్యే, గ్రామానికో మంత్రి!... ఆత్మకూరులో వైసీపీ ప్రచారంపై బీజేపీ కామెంట్!
- ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమి భయంలో ఉందన్న సత్యకుమార్
- వైసీపీ పాలనలో నెల్లూరులో అభివృద్ధి జరగలేదని వెల్లడి
- మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని వ్యాఖ్యలు
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ ప్రచారం వీధికో ఎమ్మెల్యే, గ్రామానికో మంత్రి అన్న చందంగా సాగుతోందని సత్యకుమార్ ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న కారణంగానే వైసీపీ ఈ తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర కేబినెట్‌లో నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు ఉన్నప్పటికీ జిల్లా అభివృద్ధిపై వారు దృష్టి సారించలేదని ఆరోపించారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా ఈ ప్రాంతాన్ని ఏమీ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.