త్రివిక్రమ్ - మహేశ్ మూవీ పై స్పందించిన నాని!
- రిలీజ్ కి రెడీ అవుతున్న 'అంటే .. సుందరానికీ'
- ఈ నెల 10వ తేదీనే థియేటర్లకు
- షూటింగు దశలో ఉన్న 'దసరా' సినిమా
- ఏ సినిమాలోను గెస్టు రోల్స్ చేయడం లేదని చెప్పిన నాని
ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా నాని 'దసరా' చేస్తున్నాడు. డిఫరెంట్ లుక్ తో నాని కనిపించనున్న ఈ సినిమాను దసరాకే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
ఇదిలావుంచితే, త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్ లో నాని ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నట్టుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
తాజా ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రస్తావనకు రాగా .. అదంతా పుకారేనని నాని స్పష్టం చేశాడు. ఒక్క త్రివిక్రమ్ సినిమానే కాదనీ .. తాను ఏ సినిమాలోను గెస్టు క్యారెక్టర్స్ చేయడం లేదని చెబుతూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఈ ఏడాదిలో విడుదలవుతున్న నాని రెండు సినిమాలు ఎలాంటి రెస్పాన్స్ ను రాబడతాయో చూడాలి మరి.