నిర్మాతలను చూసి ఏ ప్రేక్షకుడు సినిమాకి రాడు: అల్లు అరవింద్
- గోపీచంద్, రాశీఖన్నా జంటగా 'పక్కా కమర్షియల్'
- మారుతి దర్శకత్వంలో చిత్రం
- హైదరాబాదులో ప్రెస్ మీట్
- హాజరైన నిర్మాత అల్లు అరవింద్
ఇటీవల ఓ అగ్రహీరో వేదికపైనే డ్యాన్స్ చేశాడని, వారి సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసమే ఆ హీరో డ్యాన్స్ చేశాడని అల్లు అరవింద్ అన్నారు. అందుకే 'పక్కా కమర్షియల్' చిత్రంలో హీరోగా నటించిన గోపీచంద్ వస్తేనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని చిత్రయూనిట్ కు తాను స్పష్టం చేశానని అరవింద్ పేర్కొన్నారు.
'పక్కా కమర్షియల్' చిత్రం జులై 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో గోపీచంద్, రాశీఖన్నా జంటగా నటించారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ నిర్మించాయి. మారుతి దర్శకత్వం వహించాడు.