అట్టహాసంగా ఐపీఎల్ ముగింపు వేడుకలు... 'నాటు నాటు' పాటకు చిందేసిన రణవీర్ సింగ్
- ఐపీఎల్-15కు నేటితో తెర
- ఫైనల్లో గుజరాత్ వర్సెస్ రాజస్థాన్
- గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించిన అతిపెద్ద జెర్సీ
- క్లోజింగ్ సెర్మనీలో అలరించిన వినోద కార్యక్రమాలు
అనంతరం, బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తన ఉత్సాహభరితమైన ప్రదర్శనతో అందరినీ ఉర్రూతలూగించాడు. పలు హిందీ పాటలతో పాటు ఆర్ఆర్ఆర్ లో సూపర్ హిట్టయిన నాటు నాటు పాటకు కూడా స్టెప్పులేయడం విశేషం. ఈ క్లోజింగ్ సెర్మనీలో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, ప్రముఖ గాయని నీతి మోహన్ కూడా తమ బృందంతో కలిసి పలు హిట్ గీతాలు ఆలపించారు. మరికాసేపట్లో ఐపీఎల్ టైటిల్ సమరం ప్రారంభం కానుంది.