తారకరాముడి శత జయంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన తారక్, కల్యాణ్‌రామ్
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద శతజయంతి వేడుకలు
- పెద్ద ఎత్తున తరలివస్తున్న ఎన్టీఆర్ అభిమానులు
- పుష్ఫ గుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించిన తారక్, కల్యాణ్ రామ్
- ఎన్టీఆర్ ఫొటోతో ట్వీట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్
కాగా, ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్.. సదా మీ సేవలో.. అంటూ ఎన్టీఆర్ ఫొటోతో ట్వీట్ చేశారు. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోందని, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోందని, పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. అని రాసుకొచ్చారు.