బాలయ్య సినిమా కోసం రంగంలోకి దిగిన ఆస్ట్రేలియన్ బ్యూటీ!
- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107వ చిత్రం
- బాలయ్య సరసన నటిస్తున్న శ్రుతిహాసన్
- స్పెషల్ సాంగ్ కోసం చంద్రిక రవిని తీసుకున్నట్టు సమాచారం
ఈ చిత్రంలో ఓ మాస్ సాంగ్ ఉంది. తొలుత ఈ సాంగ్ కు డింపుల్ హయతిని తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలో నిజం లేదని తేలిపోయింది. ఇప్పుడు ఆ స్పెషల్ సాంగ్ కోసం ఆస్ట్రేలియన్ బ్యూటీ, మోడల్, భారత సంతతికి చెందిన చంద్రిక రవిని రంగంలోకి దింపినట్టు సమాచారం. ఈ సాంగ్ షూటింగ్ ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ పాట సినిమాకి హైలైట్ గా ఉంటుందని అంటున్నారు.