'శేఖర్' లిరికల్ సాంగ్ రిలీజ్!
- రాజశేఖర్ తాజా చిత్రంగా 'శేఖర్'
- మలయాళ 'జోసెఫ్'కి ఇది రీమేక్
- కథానాయికగా ఆత్మీయ రాజన్ పరిచయం
- ఈ నెల 20వ తేదీన విడుదల
అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'చిన్ని చిన్ని ప్రాణం .. చిందులాడే పాదం .. నా కోసం .. నవ్వు పంచేనా' అంటూ ఈ పాట సాగుతుంది. హీరో .. హీరోయిన్ ఇద్దరూ కూడా తమ పసి బిడ్డను చూసుకుని మురిసిపోయే నేపథ్యంలో వచ్చేపాట ఇది.
రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను చిన్మయి - హేమంత్ మహ్మద్ ఆలపించారు. పాట ఓ మాదిరిగా అనిపిస్తుందంతే. ఈ సినిమాతో ముస్కాన్ .. ఆత్మీయ రాజన్ కథనాయికలుగా కనిపించనున్నారు. ముఖ్యమైన పాత్రలో శివాని రాజశేఖర్ కనిపించనుంది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.