Cricket: అశ్విన్ బౌలింగ్ లో ఔటైన రోహిత్.. రోహిత్ భార్యను హత్తుకుని ఓదార్చిన అశ్విన్ భార్య.. ఇదిగో వీడియో

Ashwin Wife Preeti Consoles Rohit Wife Ritika

  • రాజస్థాన్ తో ముంబై మ్యాచ్ సందర్భంగా ఘటన
  • రోహిత్ ఔట్ అవడంతో మొహం మాడ్చేసిన రితిక
  • రితిక వద్దకు వెళ్లిన ప్రీతి

ఐపీఎల్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ జట్టు ఎట్టకేలకు గెలవనైతే గెలిచింది. కానీ, ఆ జట్టు సారథి రోహిత్ తాజా ఐపీఎల్ లో తన బిరుదును సార్థకం చేసుకోలేకపోతున్నాడు. పరుగులు చేయలేక సతమతమవుతున్నాడు. ఫామ్ లేమితో తంటాలు పడుతున్నాడు. పర్ ఫెక్ట్ టైమింగ్ కు మారుపేరైన రోహిత్.. ఇప్పుడు అదే టైమింగ్ లేక షాట్లు ఆడబోయి బంతిని బ్యాట్ ఎడ్జ్ చేస్తున్నాడు. ఫలితంగా క్యాచ్ అవుట్లు అవుతున్నాడు. 

అలాంటిదే నిన్న రాజస్థాన్ తో ఆడిన మ్యాచ్ లోనూ జరిగింది. రాజస్థాన్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. అశ్విన్ వేసిన మూడో ఓవర్ మూడో బంతికి స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు రోహిత్. అయితే, ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. అంతే, స్క్వేర్ లెగ్ లో ఉన్న ఫీల్డర్ బంతిని ఒడిసి పట్టుకున్నాడు. రోహిత్ రెండు పరుగులకే పెవిలియన్ చేరి విఫలమయ్యాడు. 

ఔటైనప్పుడు రోహిత్ ఎంత బాధపడ్డాడో తెలియదు గానీ.. అతడి భార్య రితికా సజ్దే మాత్రం తెగ బాధపడిపోయింది. తన భర్త అలా ఔటయ్యే సరికి మొహం మాడ్చేసింది. మరోపక్క రోహిత్ వికెట్ తీసిన అశ్విన్ భార్య ప్రీతి.. తన భర్తను చప్పట్లు కొడుతూ అభినందించింది. అయితే, రితికా సజ్దే విషణ్ణ వదనంతో ఉండడాన్ని అక్కడెక్కడో దూరంగా ఉన్న ప్రీతి చూసి ఆమె దగ్గరకు వెళ్లింది. ఆమెను గుండెలకు హత్తుకుని ఓదార్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

  • Loading...

More Telugu News