కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను మరో శ్రీలంకగా మారుస్తుంది: ప్రవీణ్ కుమార్
- టీఆర్ఎస్ పాలన ఘోరంగా ఉందన్న ప్రవీణ్ కుమార్
- ఉద్యోగాలను కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని విమర్శ
- ఎన్నికలు ఎప్పుడు జరిగినా కేసీఆర్ ఓడిపోతారని వ్యాఖ్య
అమరవీరుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పడిందని... కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విమర్శించారు. దళితులను మోసం చేసేందుకే దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. యాసంగిలో పంటలు సాగు చేయని రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.