'ఆచార్య' ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు!
- కొరటాల నుంచి 'ఆచార్య' మూవీ
- అదనపు బలంగా మణిశర్మ సంగీతం
- ఈ నెల 12వ తేదీన ట్రైలర్ రిలీజ్
- 29వ తేదీన సినిమా విడుడల
అలా ఇది మల్టీ స్టారర్ రూపాన్ని సంతరించుకుంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ అంచనాలు పెంచుతూ వెళ్లాయి. 'శ్రీరామ నవమి' సందర్భంగా ఈ నెల 10వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేయవచ్చనే టాక్ వినిపించింది. కానీ ఈ నెల 12వ తేదీన ట్రైలర్ ను వదులుతున్నట్టుగా ప్రకటించారు.
అందుకు సంబంధించిన పోస్టర్ ను అధికారికంగా ప్రకటించారు. చరణ్ - పూజ హెగ్డేలపై వేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా నిలుస్తుందని అంటున్నారు. చిరంజీవి - చరణ్ తెరపై కలిసి కనిపించే 20 నిమిషాల నిడివిగల యాక్షన్ ఎపిసోడ్ కోసం అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.