జగన్ ప్రతిపాదన న్యాయ సమీక్షకు నిలవదు... బీజేపీ ఎంపీ సుజనాచౌదరి వ్యాఖ్య
- అసెంబ్లీలో జగన్ ప్రకటనపై సుజనా స్పందన
- ఏపీకి కావాల్సింది మూడు రాజధానులు కాదని వ్యాఖ్య
- అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సూచన
- ఒకే రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందని వెల్లడి
రాజకీయ దురుద్దేశంతో జగన్ ప్రభుత్వం మళ్లీ తీసుకొచ్చే మూడు రాజధానుల ప్రతిపాదన న్యాయ సమీక్షకు నిలవదని ఈ సందర్భంగా సుజనా తేల్చి పారేశారు. ఏపీకి కావాల్సింది రాజధానుల వికేంద్రీకరణ కాదని చెప్పిన సుజనా.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సూచించారు. ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలన్నదే తన అభిమతమని చెప్పిన సుజనా చౌదరి.. ఒకే రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.