'పుష్ప 2'లో మాస్ మసాలా ఐటమ్ కోసం దిశా పటాని!
- సంచలన విజయాన్ని సాధించిన 'పుష్ప'
- దూసుకుపోయిన సమంత ఐటమ్ సాంగ్
- ఈ సారి ఛాన్స్ దిశా పటానీకి
ఇక ఈ సినిమా హైలైట్స్ లో సంగీతం ఒకటిగా కనిపిస్తుంది. అన్ని పాటలు ఒక ఎత్తు .. 'ఊ అంటావా మామ .. ఉ ఉ అంటావా మావా' అనే పాట మరో ఎత్తుగా నిలిచింది. ఈ మాస్ మసాలా సాంగ్ కోసం మొదట దిశా పటానీని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో సమంత వచ్చి చేరింది. ఈ సాంగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.
ఇక ఇప్పుడు 'పుష్ప 2'లోను ఒక హాట్ హాట్ ఐటమ్ ను సుకుమార్ - దేవిశ్రీ ప్లాన్ చేశారట. ఈ సారి మాత్రం దిశా పటానికే ఛాన్స్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారట. ఈ సినిమా సెకండ్ పార్టులో ఈ మాస్ బీట్ యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేయడం ఖాయమని అంటున్నారు.