ముగిసిన 'భీమ్లా నాయక్' షూటింగ్... వచ్చేవారం విడుదల
- ఫిబ్రవరి 25న వస్తున్న భీమ్లా నాయక్
- రామోజీ ఫిలింసిటీలో చివరి దశ షూటింగ్
- పవన్ పై సన్నివేశాల చిత్రీకరణ
- సాగర్ కె చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్
పవన్ కల్యాణ్, రానా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పవన్ కల్యాణ్ ఓ పవర్ ఫుల్, విలక్షణ పోలీసాఫీసర్ పాత్ర పోషించగా, రానా ప్రతినాయకుడిగా నటించారు. తమన్ సంగీతం అందించగా, ఇప్పటికే పాటలు సూపర్ హ్టిటయ్యాయి. భీమ్లా నాయక్ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు అందించడం సినిమాకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది.