'ఎఫ్ 3' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 3'
- డబ్బు చుట్టూ తిరిగే కథ
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
- ఏప్రిల్ 29వ తేదీన విడుదల
"లబ్ డబ్ లబ్ డబ్ డబ్బూ .. ఎవరు కనిపెట్టాడోగాని దీన్ని అబ్బో .. " అంటూ ఈ పాట సాగుతోంది. చేతిలోనే క్యాషే ఉంటే ఫేసు లోకి గ్లో వస్తుంది .. ఫ్లాషు బ్యాకు చెరిపేయొచ్చు అంటూ, పైస ఉంటేనే ఈ లోకంలో అనుకున్నవన్నీ నెరవేరతాయి .. లేదంటే పక్కకి జరుగుతాయి అనే అర్థంలో ఈ పాట నడుస్తుంది.
భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించిన ఈ పాటను రామ్ మిర్యాల ఆలపించాడు .. భాను కొరియోగ్రఫీని అందించాడు. పాట అంతా కూడా కామెడీ ప్రధానంగానే సాగుతుంది. కాకపోతే చూడటానికి .. వినడానికి కూడా కాస్త గందరగోళంగా అనిపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ .. సునీల్ .. సంగీత కనిపించనున్నారు. ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.