చిరంజీవి క్లాప్ తో రవితేజ 'రావణాసుర' సినిమా ప్రారంభం!
- భోగి పర్వదినాన 'రావణాసుర' షూటింగ్ ప్రారంభం
- చిరంజీవి క్లాప్ కొట్టగా.. కెమెరా స్విచ్చాన్ చేసిన మంత్రి తలసాని
- సెప్టెంబర్ 30న విడుదల కానున్న చిత్రం
ఈ సినిమాలో హీరో సుశాంత్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్ బ్యానర్స్ ఈ సినిమాను నిర్విస్తున్నాయి. ఈ నెలలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. 2022 సెప్టెంబర్ 30 ఈ చిత్రం విడుదల కానుంది.