తమిళ మూవీ రీమేక్ లో రానా?
- శింబూ హీరోగా వచ్చిన 'మన్నాడు'
- సురేశ్ ప్రొడక్షన్స్ చేతిలో రీమేక్ హక్కులు
- రానా తాజా చిత్రంగా '1945'
- ఈ నెల 7వ తేదీన విడుదల
ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోను విడుదల చేయాలనుకున్నారు, కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. ఈ తెలుగు సినిమా రీమేక్ హక్కులు సురేశ్ ప్రొడక్షన్స్ వారి దగ్గర ఉన్నాయట. రానాతో వారు రీమేక్ చేయాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
రానా కథానాయకుడిగా రూపొందిన '1945' సినిమా ఈ నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రెజీనా కథానాయికగా నటించిన ఈ సినిమాలో, సత్యరాజ్ కీలకమైన పాత్రను పోషించాడు. ఇక వచ్చేనెలలో 'భీమ్లా నాయక్' ప్రేక్షకులను పలకరించనుంది. ఆ తరువాతనే 'విరాట పర్వం' థియేటర్లకు రానున్నట్టుగా చెబుతున్నారు.