'మేజర్' నుంచి ఫస్టు సింగిల్ రెడీ!
- 'మేజర్' గా అడివి శేష్
- కథానాయికగా సయీ మంజ్రేకర్
- ఈ నెల 7వ తేదీన ఫస్టు సింగిల్
- ఫిబ్రవరి 11వ తేదీన సినిమా రిలీజ్
ముంబై తాజ్ హోటల్ పై కొన్నేళ్ల క్రితం జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ ఆపరేషన్ లో కీలకమైన పాత్రను పోషించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను అడివి శేష్ పోషించాడు. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకమైన కసరత్తు చేయడం విశేషం. ఈ సినిమాతో కథానాయికగా సయీ మంజ్రేకర్ తెలుగు తెరకి పరిచయమవుతోంది.
శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఆయన స్వరపరిచిన 'హృదయమా' అనే పాటను సిద్ శ్రీరామ్ ఆలపించగా, ఫస్టు సింగిల్ గా రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 7వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు ఈ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను హీరో మహేశ్ బాబు నిర్మించిన సంగతి తెలిసిందే.
.