హిందీలో 50 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన 'పుష్ప'
- తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు
- హిందీలోనూ అదే తీరు
- ఓవర్సీస్ లోను తగ్గని జోరు
- బన్నీ మార్కెట్ మరింత పెరిగినట్టే
అప్పటి నుంచి ఈ సినిమా వసూళ్ల పరంగా దూకుడు చూపుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు .. ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. హిందీ వెర్షన్ లో సినిమా 15 రోజలలోనే 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. హిందీలోకి అనువాదమైన బన్నీ సినిమాలకి అక్కడ మంచి మార్కెట్ ఉంది.
అలా అక్కడి ప్రేక్షకులకు బన్నీ బాగా తెలుసు. అందువల్లనే ఆయన సినిమా చాలా ఫాస్టుగా జనంలోకి వెళ్లగలిగిందని చెప్పుకుంటున్నారు. మహారాష్ట్ర .. గుజరాత్ లలో కరోనా ప్రభావం లేకపోతే ఈ వసూళ్లు ఇంకా ఎక్కువగా ఉండేవని అభిప్రాయపడుతున్నారు.
.