హీరో నాని వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: దిల్ రాజు
- రెండు సినిమాలు ఓటీటీకి వెళ్లిన బాధ నానిలో ఉంది
- ఆయన మనసులోకి వెళ్లి చూస్తే ఆయన బాధ అర్థమవుతుంది
- నాని చెప్పింది ఒకటైతే.. జనాల్లోకి వెళ్లింది మరొకటి
మరోవైపు నాని చేసిన వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలని నిర్మాత దిల్ రాజు అన్నారు. తన సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో నాని చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడిన తర్వాత రిలీజైన సినిమా తమదేనని... నాని, తన కాంబినేషన్లో వచ్చిన 'వి' సినిమా అని చెప్పారు.
నాని ఏం చెప్పాడనేది అందరూ ఆయన మనసుల్లోకి వెళ్లి చూడాలని, అప్పుడే ఆయన బాధ ఏమిటో అర్థమవుతుందని అన్నారు. తన రెండు సినిమాలు ఓటీటీకి వెళ్లిన బాధ ఆయనలో ఉందని చెప్పారు. దయచేసి నాని చేసిన వ్యాఖ్యలను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. నాని చెప్పిన విషయం ఒకటైతే... జనాల్లోకి వెళ్లింది మరొకటని అన్నారు.