పవన్ మామయ్యకి ఆ కథ కరెక్ట్ అని చెప్పిన సాయితేజ్!
- ఇటీవలే వచ్చిన 'రిపబ్లిక్'
- దేవ కట్టాకి దక్కిన ప్రశంసలు
- వసూళ్ల పరంగా చూపని జోరు
- ఆ సినిమాకి సీక్వెల్ అంటూ టాక్
దాంతో ఆయన సమకాలీన రాజకీయాల నేపథ్యంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని భావిస్తున్నాడట. ఇందుకు సంబంధించిన కథను ఆయన సాయితేజ్ కి వినిపించగా, ఈ కథ తనకంటే తన మామయ్య పవన్ కి బాగా సెట్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడట. ప్రస్తుతం ఆ దిశగా కథ కదులుతోందని అంటున్నారు.
నిజానికి 'రిపబ్లిక్' సినిమాను పవన్ తో చేయలనే దేవ కట్టా అనుకున్నాడట. అప్పటి పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడం వలన, సాయితేజ్ తో కానిచ్చేశాడు. ఇక ఇప్పుడు తేజ్ సపోర్ట్ కూడా ఉండటం వలన ఈ ప్రాజెక్టు సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే చెప్పుకుంటున్నారు. కాకపోతే ముందుగా పవన్ ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తి కావలసి ఉంటుంది.