'పుష్ప'లో సరికొత్త అల్లు అర్జున్ ను చూస్తారు: సుకుమార్
- డిసెంబరు 17న 'పుష్ప' రిలీజ్
- మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు బన్నీ కొత్త సినిమా
- హైదరాబాదులో చిత్ర బృందం ప్రెస్ మీట్
- అల్లు అర్జున్ తో పాటు సుకుమార్ కూడా హాజరు
అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఇలాంటి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తప్ప మరెవ్వరూ నిర్మించలేరంటూ నిర్మాతలు రవి, నవీన్, చెర్రీలకు కితాబునిచ్చారు. దర్శకుడు సుకుమార్ గురించి చెబుతూ, పుష్ప చూసినవారు కమర్షియల్ సినిమాలను ఇలా కూడా తీయొచ్చా అని ఆశ్చర్యపోవడం ఖాయమని బన్నీ పేర్కొన్నారు.