రోహిత్ శర్మ–విరాట్ కోహ్లీ వివాదంపై కేంద్ర మంత్రి స్పందన
- ఆటకన్నా ఏ ఆటగాడూ ఎక్కువ కాదన్న అనురాగ్ ఠాకూర్
- ఎవరి మధ్య ఏం జరుగుతుందో నేను చెప్పలేను
- అది సంబంధిత క్రీడా సమాఖ్య, సంఘాల పని

కాగా, ఇటీవల వన్డే సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీని తప్పించి రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి క్రికెట్ లో వాతావరణం కాస్త వేడెక్కింది. గాయమంటూ టెస్టులకు రోహిత్ దూరమయ్యాడు. ఆ మర్నాడే కూతురు బర్త్ డే అంటూ కోహ్లీ కూడా వన్డేలకు అందుబాటులో ఉండనన్నాడంటూ ఓ అధికారి చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత కోహ్లీ అధికారికంగా ప్రకటించలేదు అని చెప్పకపోయినా.. అప్పటికే అజారుద్దీన్, కీర్తి ఆజాద్ లాంటి మాజీలు రోహిత్, కోహ్లీ మధ్య ఏదో జరుగుతోందన్న అంచనాకు వచ్చేశారు. అది క్రికెట్ కు ఎంత మాత్రమూ మంచిది కాదంటూ హితవు చెప్పే ప్రయత్నం చేశారు.